కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ భవనం పేదవాడికి ఒక నమ్మకం కల్పించాలి. పేదల సమస్యల చిక్కుముడులు విప్పడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలి. సంక్షేమపథకాలు పేదలకు చేరవేసే ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులే. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశాం. సహాయం కోసం నిస్సహాయంగా వచ్చే వారిలో మన కుటుంబ సభ్యులను చూడండి. అప్పుడే సహాయం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మీ సహకారంతో వీలైనంత మేరకు మీ సమస్యలను పరిష్కరిస్తున్నాం. మనం ప్రజలకు సేవలు అందిస్తూనే సమస్యలను పరిష్కరించుకుందాం. అప్పుడే ప్రజలకు మనపై విశ్వాసం బలపడుతుంది. మీరంతా కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా మంచి పేరు రావాలంటే ఉద్యోగుల సహకారంతోనే . ప్రజలకు సేవలు అందించే మీకు మౌలిక వసతులు కల్పించాలని ఈ భవన సముదాయ నిర్మాణం పూర్తి చేశాం. కేంద్రంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళతామని అన్నారు.
వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా కేంద్రం అనుమతులు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు. కానీ కొందరు మా పర్యటనలను లెక్కలేస్తున్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు నెలల్లోనే 170 ఎకరాలు డిఫెన్స్ భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం బదలాయించేలా చేశాం. బేగంపేట రన్ వే కింద నుంచి రోడ్డు వేసుకునేందుకు అనుమతులు సాధించాం. సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం ఒకరికొకరం సహకరించుకుంటాం. మరోసారి జిల్లా అభివృద్ధిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.
======================

