ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే  సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్  శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవో షర్మిల, డీఆర్ఓ స్వామితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 212 దరఖాస్తులు అందగా, అత్యధికంగా కరీంనగర్ ఆర్డీవో కార్యాలయానికి 66, గృహ నిర్మాణ శాఖకు 44 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి దరఖాస్తులు, కోర్టు కేసులు అనవసరంగా పెండింగ్‌లో ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!