ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeసినిమాప్రొడ్యూసర్స్ ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని, డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబో క్రేజీ మూవీ నుంచి...

ప్రొడ్యూసర్స్ ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని, డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబో క్రేజీ మూవీ నుంచి యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

📰 Generate e-Paper Clip

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో యూత్ ఆడియెన్స్ లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్, వరుస హిట్స్ అందుకుంటున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.3 గా నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ రోజు హీరో సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మారుతి అనే పాత్రలో సంగీత్ శోభన్ నటిస్తున్నారు. బర్త్ డే పోస్టర్ చూస్తే – బుట్టలో ఆకుకూరలు తీసుకొస్తూ మిడిల్ క్లాస్ అబ్బాయి లుక్ లో సంగీత్ శోభన్ కనిపిస్తున్నారు. ఇలాంటి పొరుగింటి అబ్బాయి క్యారెక్టర్స్ సంగీత శోభన్ కు టైలర్ మేడ్ లా ఉంటూ ఆకట్టుకుంటాయి. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడేలా ఈ సినిమా తెరపైకి రాబోతోంది.
నటీనటులు – సంగీత్ శోభన్, అనస్వర రాజన్, తదితరులు
==============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!