ePaper
Tuesday, September 1, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మైనర్ బాలిక సురక్షితంగా గుర్తింపునిందితులు పోలీసుల అదుపులో

మైనర్ బాలిక సురక్షితంగా గుర్తింపునిందితులు పోలీసుల అదుపులో

📰 Generate e-Paper Clip

మైనర్ బాలిక సురక్షితంగా గుర్తింపునిందితులు పోలీసుల అదుపులో

అర్జున్ సమాచారం.సెప్టెంబర్ 1: ముత్తారం.రిపోర్టర్

పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) హాస్టల్‌లో విద్యనభ్యసిస్తున్న మైనర్ బాలికను పోలీసులు సురక్షితంగా గుర్తించారు. బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఉదయం సుమారు 6 గంటల సమయంలో కవిత అనే మహిళ బాలికకు పెద్దమ్మనని పరిచయం చేసుకుని, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లింది. అనంతరం బాలిక ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తల్లి హాస్టల్‌కు వచ్చి విచారించగా, కవితతో బాలికను పంపించినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు.

బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, ముత్తారం పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బాలికను సురక్షితంగా గుర్తించి, ఘటనకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం బాలికను సఖి సెంటర్‌కు తరలించి, అవసరమైన కౌన్సెలింగ్, సంరక్షణతో పాటు తదుపరి సహాయ చర్యలు అందించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ముత్తారం పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!