తిరుమల,అర్జున్ సమాచారం:
తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఘనంగా ఆహ్వానించింది.
ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, జానకిదేవి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఛైర్మన్, ఈవోలతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు, అర్చకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
==========================

