ePaper
Thursday, July 9, 2026
ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాయాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చోటు ఏది నువ్వు చంద్రబాబు ఆంధ్ర...

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చోటు ఏది నువ్వు చంద్రబాబు ఆంధ్ర బానిసవు యాదాద్రి నర్సన్న సాక్షిగా నిరూపితమైంది రేవంత్ ఇదేం బానిసత్వం…._ టిటిడి తరహాలో సలహా మండలి ఏర్పాటు చేయాలి బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

భువనగిరి జులై 2 ,అర్జున్ సమాచారం :
తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డ్ మెంబర్లూగా గతంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి డివిజన్ ఇన్చార్జిగా ఉన్న చింతల వెంకటేశ్వర రెడ్డి  నాయకత్వంలో ఆరోజు అప్పటి ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కూర్చొని  𝟮𝟬𝟬𝟳/𝟮𝟬𝟬𝟵 సంవత్సరంలో ఏర్పాటు చేసిన బోర్డు సభ్యుల నియామకంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 𝟴 మందిని నియమిస్తే, 𝟰గురు సభ్యులను చింతల వెంకటేశ్వర్ రెడ్డి  ఆదేశాల మేరకు బోర్డు సభ్యులుగా తీసుకోవడం జరిగింది.
ముగ్గురు సభ్యులు భువనగిరి నుంచి ఒకరు యాదగిరిగుట్ట నుంచి తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం అత్యంత బాధాకరమని  చింతల వెంకటేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం డబ్బున్న బడా నాయకులకు అవకాశం కల్పించారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు లోకల్ వాళ్లకు ఒక్కరు కూడా అవకాశం కల్పించలేదని విమర్శించారు.
ఆరోజు  స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారితో కూర్చొని బోర్డు ఏర్పాటు చేశారు ఈ విషయం అప్పటి కాంగ్రెస్ నాయకులకు అందరికీ తెలిసేది  సామాన్య మానవులకు సామాన్య కార్యకర్తలకు అవకాశం కల్పించారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెను వెంటనే స్పందించి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో ఆరుగురిని   యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించాలని BRS రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి  డిమాండ్ చేశారు.
చరిత్రలో స్థానికులకు ధర్మకర్తల మండలిలో స్థానం కల్పించకపోవడం ఇదే మొదటిసారి.. ఇది చాలా బాధాకరమని ఆయన అన్నారు.
===============

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!