ePaper
Sunday, October 11, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్న్యాయవ్యవస్థలో బహుజనులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీ లాయర్స్...

న్యాయవ్యవస్థలో బహుజనులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీ లాయర్స్ అసోసియేషన్ తీర్మానం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అక్టోబర్ 10:అర్జున్ సమాచారం:
న్యాయవ్యవస్థలో బహుజన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ లాయర్స్ అసోసియేషన్ తీర్మానించింది. న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు బలోపేతం కావాలంటే న్యాయమూర్తుల నియామకాలతో సహా అన్ని కీలక వ్యవస్థల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా బహుజన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది.

హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం ‘ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అనే అంశంపై బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు తలకొక్కుల రాజు అధ్యక్షతన, కార్యదర్శి పొన్నం దేవరాజ్ గౌడ్ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని న్యాయవ్యవస్థలో సామాజిక ప్రాతినిధ్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

న్యాయవ్యవస్థలో సమాన అవకాశాలకు ప్రాధాన్యం

సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం అందించే వ్యవస్థలోనే అన్ని సామాజిక వర్గాలకు తగిన భాగస్వామ్యం ఉండాలని వక్తలు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో బహుజన వర్గాల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. అర్హత కలిగిన బహుజన న్యాయవాదులకు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!