ePaper
Monday, October 12, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లివినియోగ దారునికి నాణ్యమైన బొగ్గును అందించాలి క్వాలిటీ జి.ఎం

వినియోగ దారునికి నాణ్యమైన బొగ్గును అందించాలి క్వాలిటీ జి.ఎం

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:

వినియోగ దారునికి నాణ్యమైన బొగ్గును అందించాలని రామగుండం రీజియన్ నాణ్యత విభాగం జనరల్ మేనేజర్ జె.వెంకటరమణ అన్నారు. ఆయన బుధవారం రామగుండం-3 ఏరియాలో పర్యటించారు.నూతనంగా రామగుండం రీజియన్ నాణ్యత విభాగం జనరల్ మేనేజర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఏరియాలో పర్యటించిన సందర్భంగా జి.యం. కార్యాలయం నందు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, ఇతర అధికారులు వారిని శాలువాతో సత్కరించి, మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాణ్యత విభాగం జి.ఎం మాట్లాడుతూ బొగ్గు నాణ్యతలో ఆర్జీత్రీ ఏరియా ముందంజలో ఉందని, మున్ముందు ఇలాగే కొనసాగిస్తూ, వినియోగదారునికి నాణ్యతతో కూడిన బొగ్గును సరఫరా చేయాలని, అందుకు తగిన చర్యలను తీసుకోవాలని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
అనంతరం వారు ఏరియా లోని ఓ.సి.పి-1 ఉపరితల గనిని సందర్శించారు.
కార్యక్రమంలో ఎస్వోటుజిఎం యం.రామ్మోహన్, విభాగధిపతులు బి.టి.మురళీకృష్ణ, సి.జె.సురేఖ, బి.సుదర్శనం, ఆసిఫ్ యాసిన్, అప్సర్ పాషా, ఆర్.రాజేశ్వరి, షబ్బీరుద్దీన్, రవి చరణ్, మనోజ్ ఇతర అధికారులు ఉన్నారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!