ePaper
Friday, November 27, 2026
ePaper
Homeసినిమావిష్ణు మంచు బర్త్ డే స్పెషల్‌గా '#VM24'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభు దేవా

విష్ణు మంచు బర్త్ డే స్పెషల్‌గా ‘#VM24’పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభు దేవా

📰 Generate e-Paper Clip

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. విష్ణు మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే వారిద్దరి కలయికలో రాబోయే ఒక భారీ ప్రాజెక్ట్ ‘VM 24’ గురించి ప్రకటించేశారు. సోషల్ మీడియా వేదికగా విష్ణు మంచును మై హీరో, మై బ్రదర్ అని ఆప్యాయంగా సంబోధించారు ప్రభుదేవా. ఇక తమ కాంబోలో విష్ణు మంచు 24వ ప్రాజెక్ట్ రాబోతోందని వెల్లడించారు.
‘నా హీరో, నా తమ్ముడు విష్ణు మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు వేడుకను మరింత ప్రత్యేకంగా రంగులమయంగా మారుస్తూ ‘VM 24’ని ప్రకటిస్తున్నాం. ప్రభుదేవా × విష్ణు మంచు’ అని ప్రభుదేవా పేర్కొనడంతో, విష్ణు మంచు పుట్టినరోజు వేడుకల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ఇటీవల ‘కన్నప్ప’ చిత్రంతో మంచి గుర్తింపు పొందిన విష్ణు మంచు, ఇప్పుడు ప్రభుదేవా దర్శకత్వంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ప్రభుదేవా చెప్పిన కథ విష్ణు మంచుకు ఎంతగానో నచ్చడంతో, ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త, విభిన్నమైన సినిమా అనుభవాన్ని అందించనుందని సమాచారం. యాక్షన్, థ్రిల్లర్ జానర్‌లో ఈ మూవీని రూపొందించనున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. విష్ణు మంచు తన పాత్రకు తగ్గట్టుగా విష్ణు మంచు శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో నిర్మించాలని నిర్మాతలు యోచిస్తున్నారు. మేకర్‌గా ప్రభుదేవాకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రభు దేవా, విష్ణు మంచు కాంబో అనగానే సహజంగానే ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన తారాగణం, సాంకేతిక బృందం, అధికారిక ప్రకటనతో సహా మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!