ePaper
Friday, September 18, 2026
ePaper
Homeతెలంగాణసుప్రీంకోర్టులో మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

సుప్రీంకోర్టులో మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
గురువారం నాడు సుప్రీంకోర్టు లో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది.  తమపై నమోదైన కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి  సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే. సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా రేవంత్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టం వర్తించదని సుప్రీంకోర్టుకు  రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు. అయితే ఓటు అనేది చట్టబద్ధమైన హక్కు అని, దానిని ప్రభావితం చేసినప్పుడు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని న్యాయమూర్తి  కీలక వ్యాఖ్యలు చేసారు. తదుపరి విచారణలో బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదనలు వింటామని కేసును సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
———————-

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!