న్యూఢిల్లీ, ఆగస్టు 12,అర్జున్ సమాచారం:
17వ శతాబ్దంలో వర్తకం కోసం ఇండియాకు వచ్చిన ఆంగ్లేయులు.. తర్వాత నాటి దేశంలోని అనైక్యతను ఆసరాగా తీసుకుని చివరకు అధికారం చేజిక్కించుకుని పెత్తనం చెలాయించారు. దాదాపు 200 సంవత్సరాల పాటు సాగిన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. చివరకు 1947లో భరతమాతకు విదేశీ పాలన నుంచి విముక్తి లభించింది. ఆ ఏడాది 15న స్వాతంత్య్రం లభించింది. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 15న భారతావని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. భారతదేశం మరో నాలుగు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. అయితే ఈ వేడుక సమీపిస్తున్న తరుణంలో ఒక ప్రశ్న తరచుగా వేధిస్తుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం 79వదా లేక 80వదా?. భారతదేశం స్వాతంత్య్ర పొంది ఎన్ని సంవత్సరాలు గడిచాయి? లేదా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంఖ్య ఎంత? అనే దానిపై ఈ సమాధానం ఆధారపడి ఉంటుంది. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. అందువల్ల 2026 ఆగస్టు 15 నాటికి దేశం 79 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకుంటుంది. కానీ, 2026 ఆగస్టు 15 భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సూచిస్తుంది.
79 లేదా 80వ వేడుకనా?
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. కాబట్టి 2026 ఆగస్టు 15 నాటికి 79 ఏళ్లు పూర్తవుతాయి. అంటే, 2026 – 1947 = 79 సంవత్సరాలు. అదే సమయంలో మొదటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని 1947లోనే జరుపుకున్నాం. ఆ వేడుకను మొదటి స్వాతంత్య్ర దినోత్సవం అనుకుంటే 2026 నాటికి ఇది 80వ వేడుక అవుతుంది. కాబట్టి, వేటిని పరిగణనలోకి తీసుకుంటున్నారనే దానిబట్టి ఈ రెండు పదాలు సరైనవే కావచ్చు. ఎందుకంటే 2026 నాటికి 79 వ స్వాతంత్ర్యం పూర్తవుతుంది. 2026 ఆగస్టు 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆగస్టు 15, 1947 భారత మొదటి స్వాతంత్ర్య దినోత్సవం.
ఈ ఏడాది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా?
వార్షికోత్సవానికి, సంఖ్యతో కూడిన వేడుకకు మధ్య ఉండే వ్యత్యాసమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, దేశం తన తొలి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఆ తర్వాత సంవత్సరం రెండోది. ప్రతి ఆగస్టు 15న ఈ లెక్కింపు కొనసాగింది.
1947 – మొదటి స్వాతంత్య్ర దినోత్సవం
1948 – రెండో స్వాతంత్య్ర దినోత్సవం
1949 – మూడో స్వాతంత్య్ర దినోత్సవం
2025 – 79వ స్వాతంత్య్ర దినోత్సవం
2026 – 80వ స్వాతంత్య్ర దినోత్సవం
కాబట్టి దేశానికి స్వాతంత్య్ర వచ్చి 79 ఏళ్లు పూర్తయినప్పటికీ, 2026 ఆగస్టు 15 భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం కావడానికి ఇదే కారణం.భారత్ 2026లోనే తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 79 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చి ఎన్ని సంవత్సరాలైంది అని అడిగితే సమాధానం 79 ఏళ్లు. భారతదేశం ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది అని అడిగితే, సమాధానం 80వ స్వాతంత్ర్య దినోత్సవం.
స్వాతంత్య్ర దినోత్సవం 2026 వేడుకలు
దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న విముక్తి లభించడంతో ఏటా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా జెండా వందన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర వేడుకలతో దీనిని నిర్వహిస్తారు. ప్రధాన జాతీయ వేడుక న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతుంది. అక్కడ ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు
====================
స్వాతంత్ర్య దినోత్సవానికి రెడ్ ఫోర్ట్ సిద్ధం
RELATED ARTICLES

