న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నరేంద్రమోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుపట్టారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడాన్ని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో తీవ్రమైన వైఫల్యాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సదరు కేంద్ర మంత్రి బాధ్యత వహించకుండా పదవిలో ఇంకా కొనసాగుతున్నారని సోనియా గాంధీ ధ్వజమెత్తారు.
===========================

