సింగరేణి సహకారంతో నాలుగు కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 25:
రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సెంటినరీ కాలనీ సి-2 క్వార్టర్లలో నాలుగు ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ-పి వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు.
సి-2 క్వార్టర్లలోని పాత ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా, నర్సరీ చౌరస్తా, సి-2 చివరి క్వార్టర్లలోని రెండు చౌరస్తాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని గతంలో సర్పంచ్ పల్లె ప్రతిమ-పి వీరయ్య ఆర్జీ-2 జీఎం సుంకర మధుసూదన్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన జీఎం సుంకర మధుసూదన్ ఆదేశాల మేరకు ఆర్జీ-2 వర్క్‌షాప్ ఇన్‌చార్జి ఎర్రం వెంకటరామిరెడ్డి లైటింగ్ స్తంభాలను అందజేశారు.
అనంతరం సెంటినరీ కాలనీ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సంపత్ ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాద్రపు ప్రవళిక-ప్రశాంత్, వార్డు సభ్యులు బత్తుల రాజమణి-రమేష్, జుట్టు యశోద, బత్తిని ప్రశాంత్, పున్నం మణితేజ, అల్లి రమేష్, గ్రామ కార్యదర్శి గంగుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

