ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిసూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి రైతులతో...

సూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులు వివరించండి సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ తో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ ఏలేరు నుంచి కాకినాడ జిల్లాకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు సూపర్ ఎల్ నినో పరిస్థితులపై చర్చ

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
సూపర్ ఎల్ నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్  రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు  నిమ్మల రామానాయుడు కి సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. సూపర్ ఎల్ నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో జలవనరుల శాఖ మంత్రి  నిమ్మల రామానాయుడు  గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించారు.
ఈ సందర్భంగా- కాకినాడ జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర నియోజకవర్గాల రైతుల కోసం అడిగిన వెంటనే ఏలేరు ప్రాజెక్టు నుంచి వెంటనే 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఉప ముఖ్యమంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో నెలకొన్న నీటి కొరత పరిస్థితులను పరిశీలించేందుకు ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నట్టు  నిమ్మల రామానాయుడు  వివరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  పలు కీలక అంశాలను ప్రస్థావించారు. క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా సూపర్ ఎల్ నినో ప్రభావం, దాని వల్ల ఏర్పడుతున్న నీటి కొరత పరిస్థితులపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రతి రైతు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా చేయించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అవకాశం ఉన్న చోట రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి, ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మత్తులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని చెప్పారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా మరియు పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.
అంతకు ముందు భుజం గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న  పవన్ కళ్యాణ్ ని రామానాయుడు  పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరితగతిన కోలుకుని తిరిగి ప్రజా సేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!