తుగ్గలి:అర్జున్ సమాచారం:
రైతుల సంక్షేమం,మార్కెట్ యార్డుల అభివృద్ధి,ఆధునీకరణ అంశాలపై పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తుగ్గలి రంగ పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబు ఆధ్వర్యంలో గురువారం మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పత్తికొండ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు ప్రభుత్వం చొరవ చూపాలని మంత్రికి ఆయన తెలియజేశారు.వర్షాకాలంలో మార్కెట్ యార్డు నందు నీరు నిల్వ ఉండి మార్కెట్ యార్డ్ బురదమయంగా మారుతుందని, కావున మార్కెట్ యార్డ్ నందు సిమెంట్ బెడ్ నిధుల కొరకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా మార్కెట్ యార్డ్ నందు కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టాలని,మార్కెట్ యార్డుకు పూర్తిస్థాయిలో ప్రహరీ గోడ నిర్మాణంకు సంబంధించి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసి పత్తికొండ మార్కెట్ యార్డును అభివృద్ధి పరచాలని మంత్రి లోకేష్ కు వివరించినట్లు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తుగ్గలి రంగా తెలియజేశారు.దీనిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
==============================

