ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణకాసిపేట కేకే ఓసీ అడ్డుకున్న గ్రామస్తులుఇచ్చిన హామీలని అమలు చేయాలి.

కాసిపేట కేకే ఓసీ అడ్డుకున్న గ్రామస్తులుఇచ్చిన హామీలని అమలు చేయాలి.

📰 Generate e-Paper Clip

కాసిపేట కేకే ఓసీ అడ్డుకున్న గ్రామస్తులుఇచ్చిన హామీలని అమలు చేయాలి.

అర్జున్ సమాచారం నియోజకవర్గ ప్రతినిధి

Kk oc అడ్డుకున్న గ్రామస్తులు.. దుబ్బ గూడెం గ్రామ నీ మోసం చేసిన సింగరేణి అధికారులు
KK OC ముంపు గ్రామమైన R&R దుబ్బగూడెం గ్రామ ప్రజలకు సింగరేణి అధికారులు గత మూడు సంవత్సరాలుగా ప్రతి సమావేశంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇంటి నిర్మాణ అనుమతులు (ఫ్రీ పర్మిషన్) అందజేస్తామని హామీ ఇస్తూ వచ్చారు. ఆ హామీలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మా గ్రామ ప్రజల వద్ద ఉన్నాయి.
అయితే, ఈరోజు సింగరేణి అధికారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడం గ్రామ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది.
R&R ప్యాకేజీ కింద బీసీ కుటుంబాలకు రూ.7,61.000, ఎస్సీ కుటుంబాలకు రూ.8,11,000 మాత్రమే అందాయి. ప్రస్తుత నిర్మాణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ మొత్తంతో ఇల్లు పూర్తి చేయడం చాలా కష్టంగా ఉంది. ఫ్లాట్లపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇస్తే బ్యాంకు రుణాలు పొందవచ్చని ప్రభుత్వ సమావేశాల్లో పలుమార్లు అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీని అమలు చేయకపోవడం అన్యాయంగా ఉంది.
అందువల్ల ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని R&R దుబ్బగూడెం గ్రామానికి ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల జారీ, ఇంటి నంబర్ల ఆన్‌లైన్ నమోదు, ఉచిత ఇంటి నిర్మాణ అనుమతులు త్వరగా కల్పించేలా C5 రోడ్డు పూర్తి చేయగలరు.సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని మా గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో కాసిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బడవత్ నీలా, ఉప సర్పంచ్ బూరుగుపల్లి రమేష్ శ్రీను. శ్యామ్.తిరుపతి. సతీష్. దుబ్బగూడం గ్రామ ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!