ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణపోలీస్ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాలి,

పోలీస్ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాలి,

📰 Generate e-Paper Clip

పోలీస్ కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాలి,

అర్జున సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. ఆగస్టు 11.

మంచిర్యాల జిల్లాలోని ఇటీవల పోలీస్ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో క్యాతన్ పల్లి పట్టణంలోని నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా జాగృతి సమితి అధ్యక్షుడు రాజలింగు మోతె మున్సిపల్ చైర్‌పర్సన్‌కు మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో రిప్రజెంటేషన్ అందజేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ప్రైవేట్ కోచింగ్ ఫీజులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల మున్సిపాలిటీ సామాజిక బాధ్యతగా భావించి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాత పరీక్షలతో పాటు ఫిజికల్ ట్రైనింగ్, స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు తదితర సౌకర్యాలను ఉచితంగా అందించాలని కోరారు.
పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయం చాలా ముక్యమైన సమయం కాబట్టి ఈ సందర్భంగా ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వేల్పుల వెంకటస్వామి, రామిళ్ళ మల్లేష్,ఎట్టం లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!