ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణజగిత్యాలయూట్యూబ్ కళాకారుల బోనాల జాతర  

యూట్యూబ్ కళాకారుల బోనాల జాతర  

📰 Generate e-Paper Clip

యూట్యూబ్ కళాకారుల బోనాల జాతర  

జగిత్యాల ప్రతినిధి ::

అర్జున్ సమాచారం ఆగస్టు 11::

ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా యూట్యూబ్ కళాకారుల బోనాల జాతర వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బోనాల పండుగను ఇంత ఘనంగా నిర్వహించినందుకు కళామతల్లి ముద్దుబిడ్డలైన అందరి కళాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరువలేనిదని అన్నారు.
ఆనాడు తెలంగాణ సాధన కోసం కళాకారులు బోనమెత్తితే మళ్ళీ ఈ రోజు ప్రజల సంక్షేమం కోసం కళాకారులు బోనమెత్తారని అన్నారు.
BRS హయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కళాకారులను కడుపులో పెట్టి చూసుకున్నాడు అని అన్నారు.
కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలని అమ్మవారిని కోరుకున్నారు.
అమ్మవారి కృప వల్ల జగిత్యాల జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు BRS సీనియర్ నాయకులు పడిగేలా గంగారెడ్డి రామకృష్ణ కాలేజ్ అదినేత రామకృష్ణ పట్టణ కౌన్సిలర్లు లక్ష్మీ చంద్ర కల గంగమల్లు గంగాధర్ నాయకులు అనురాధ బొల్లరపు కళ్యాణి నవీన్ ఆరుముల్ల మానస శివకుమార్ భాగ్య లక్ష్మి పుష్ప లక్ష్మణ్ యూట్యూబ్ కళాకారులు నాయకులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!