ఘనంగా 70వ SGF క్రీడా సంబరాలుదర్యాపూర్ మోడల్ స్కూల్లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 1 | ముత్తారం రిపోర్టర్
ముత్తారం మండలంలోని దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో 70వ SGF (School Games Federation) క్రీడా సంబరాల్లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా కోకో, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు.
కార్యక్రమంలో MEO హరి ప్రసాద్, SI రవి, సర్పంచ్ రాపెల్లి రాజయ్య, దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. కేసరి సంతోష్ కుమార్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
అలాగే మండల SGF కార్యదర్శి కే. వెంకటేష్, వ్యాయామ ఉపాధ్యాయులు స్వప్న, రజిత, దుర్గాభవాని, శ్రీమన్ తదితరులతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేశారు.
క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

