ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeజాతియంఢిల్లీవరుసగా 13వ సారి జెండా ఎగరేసిన మోడీ

వరుసగా 13వ సారి జెండా ఎగరేసిన మోడీ

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, ఆగస్టు 15,అర్జున్ సమాచారం:
భారతదేశ 80వ స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోట బురుజుల నుంచి వరుసగా 13వ సారి జాతినుద్దేశించి ప్రసంగించి, అత్యధికసార్లు ప్రసంగించిన కాంగ్రెసేతర ప్రధానిగా ఒక కొత్త రికార్డును నెలకొల్పారు.2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏటా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సంప్రదాయాన్ని మోదీ కొనసాగిస్తున్నారు. కార్యక్రమం ఖరారైన షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం సైన్యం 21 తుపాకులతో గౌరవ వందనం సమర్పించింది. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడం ఈ వేడుకల్లో భాగంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు దేశ ప్రగతి, సాధించిన విజయాలు, భవిష్యత్ దార్శనికతను తన ప్రసంగంలో వివరించారు.స్వాతంత్ర్య వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. జాతీయ గేయం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకల్లో దీనికి ప్రముఖ స్థానం కల్పించారు. స్వాతంత్ర్య వేడుకల చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటపై ‘వందేమాతరం’ సామూహిక గానం జరగనుంది. ఎన్‌సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు కలిసి ఈ గేయాన్ని ఆలపించారు.2047 నాటికి ‘వికసిత భారత్’ నిర్మాణంలో యువత శక్తి, ఆకాంక్షలు, భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ ‘యువశక్తి’కి కూడా ఈసారి వేడుకల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. చారిత్రక వారసత్వానికి, భవిష్యత్ లక్ష్యాలకు వారధిగా ఈ ఏడాది 80వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించారు
================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!