స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు అయ్యింది సామాన్యుల జీవితాలలో మిగిలింది ఏముంది!
… . . … అర్జున్ సమాచారం…. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 15
భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగి 80 ఏళ్లు గడిచిపోయింది అయినా కూడా పేద ప్రజలకు ఒరిగిందేముంది అనే ప్రశ్న సర్వత్ర దేశవ్యాప్తంగా వినిపిస్తుంది మన దేశంలో ధనికులు పెరిగారు కార్పొరేట్ సంస్థలు ఎదిగాయి కానీ పేదవాడు మరింత పేదవాడుగా మారాడు తప్ప స్వతంత్ర ఫలాలు కూటికి లేనోని గడప చేరలేదు పాలించిన వాళ్ళ ఆస్తులు కోట్లల్లో విదేశీ బ్యాంకుల్లో చేరాయి భారతదేశ సంపదను విదేశీ బ్యాంకులకు తరలించి దాచుకునే అవకాశం పాలకవర్గాలకు మిగిలింది పేదలకు మాత్రం రెండు పూటలా తిండి దొరకని పరిస్థితి దాపురించింది ఇదేమి చాలదన్నట్లు పాలకులు చిన్నచిన్న పరిశ్రమలలో పనిచేస్తూ జీవిస్తున్న ఎంతోమంది చిరు ఉద్యోగులను బజారు పాలు చేసింది నూతన ఆర్థిక సరళీకరణ అనే పేరు మీద పేదలని శ్రమ దోపిడీకి గురి చేస్తూ వడ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వారి ఆస్తులను పెంచేందుకు పాలకులే దగ్గరుండి వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నారు అమెరికాలో భారతదేశానికి సంబంధించిన ఒక కార్పొరేట్ దిగ్గజం పెట్టుబడులు పెట్టి అక్కడి వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తే అది కాస్త తిరగబడి ఆ ఆ పారిశ్రామిక వేత్తకు చేదు అనుభవం ఎదురయ్యింది మన దేశ సంపదను విదేశాలలో పెట్టుబడులుగా పెడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఇక్కడి పారిశ్రామిక వేత్తలు భారత పౌరుల ప్రయోజనాలను కాపాడిన దాఖలాలు మచ్చుకు కూడా కనపడవు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా దేశం మొత్తం మీద దోపిడీ వ్యవస్థ బలపడింది తప్ప పేదోడికి రెండు పూటల బువ్వ దొరికే పరిస్థితి లేకుంటే అయింది చిన్నదో పెద్దదో కొలువు చేసుకుందాం భార్య పిల్లలతో సుఖంగా జీవిద్దాం అనుకున్న కోట్లాది మందిని లక్షలాది పరిశ్రమలు మూసేసి బిచ్చగాళ్ళుగా మార్చిన చరిత్ర మన దేశ పాలకులు సృష్టించారు దాన్నింక కొనసాగిస్తూనే ఉన్నారు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు పరిశ్రమ ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా కోట్లాది జీవులకు బ్రతుకుతెరువును పంచింది అలాంటి సంస్థను బొగ్గు గనులు కేటాయించకుండా కార్మికుల సంఖ్యను దినదినం కుదిస్తూ చరిత్ర పుటల నుండి సింగరేణి సంస్థను రూపుమాపే ప్రయత్నం చేస్తుంది బడా పెట్టుబడిదారులకు న్యాయం చేయడమే లక్ష్యం చేసుకుని ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా కబళించాలంటే ఇక్కడ అధికారం వాళ్ల చేతికి అందాలనే లక్ష్యంతో ఆకలి కాకుండా మీకు మందిస్తాం మీ చంకలో సద్ది మాకివ్వండి అన్న చందంగా సింగరేణి సంస్థ సర్వే చేసుకుని ప్రారంభించుకుని గనులను పర్మిషన్ ఇవ్వకుండా నిలిపేసి కార్మికుల సంఖ్యను లక్ష నుండి 50 వేలకు కుదించిన చరిత్ర మన ముందు స్పష్టంగా కనపడుతూనే ఉంది అయినా మన నాయకులు ఈ పరిస్థితుల పైన కించిత్తు మానవత్వాన్ని ప్రదర్శించకుండా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారి వారిచ్చే పదికో పరకకో అమ్ముడుపోయి సింగరేణి ప్రాంత కుటుంబాల ఉసురుపోసుకుంటున్నారు తప్ప ఈ సంస్థ వల్లనే మనం ఇన్ని ఆస్తులు కూడా పెట్టాము సంస్థ అదొకటి పాలైతే మనం కార్మికులకు ఇచ్చిన మాట తప్పినోళ్లమే అవుతాము కదా అనే బాధ వారిలో ఏమాత్రం కనపడడం లేదు ప్రభుత్వం దగ్గర సమావేశాలకు వెళ్లి వేలం పాటల ద్వారా బొగ్గు గనులను పొందాలని వీళ్లే గొప్ప ప్రచారానికి ఒడిగట్టారంటే వీళ్ళ విధానమేంటో ఈ ప్రాంత ప్రజలకు కార్మిక కుటుంబాలకు ఇప్పటికే పూర్తిగా అవగతం అయిపోయింది అయినా వీళ్ళ ఎత్తుగడలు కొత్త కొత్త రూపాలలో కొత్త సీసాలో పాత సారా మాదిరిగా అమాయక యువతను వారి దగ్గర చేర్చుకొని లేనిపోని ఆశలు కల్పించి సింగరేణి కార్మికులకు మాయ మాటలు చెబుతూ నికార్సైన నాయకులం మేమేనంటూ ఎలాంటి అనుకు బెనుకు లేకుండా తెలివితేటలు ప్రదర్శిస్తూనే ఉన్నారు గెలిచిన సంఘాలు కార్మికుల శ్రమను కోట్లల్లో దోచుకుంటూ వాటి నుండి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల గెలుపు కోసం ఎన్నికల సమయంలో వెదజల్లి మళ్లీ గెలుపు మనకే దక్కాలని సింగరేణి సర్వనాశనం చేసేదాకా వదలకూడదు అన్నట్టు పట్టుదలని విక్రమార్కుల్లా ఇంకా వారి ఆకలికి అర్రులు చాస్తూనే ఉన్నారు మెడికల్ ఇన్వాల్యుడేషన్ అనే పేరుతో జరిగిన దోపిడి విధానం జోరుగా సాగి కోట్లాది రూపాయల కుంభకోణాలకు కారణమయ్యింది అయినా కార్మిక వర్గం బరిస్తూనే కుటుంబంలో ఒక్క పోరని కన్న కొలువు దక్కుతదని గంపెడు ఆశలతో భరిస్తూనే వస్తున్నారు మొన్నటికి మొన్న ఇన్వాల్యుడేషన్ నిర్వహించి 2 వందల మందిని బోర్డుకు పిలిసి కేవలం 22 మందిని మాత్రమే ఇన్వాల్యుడేషన్ గా ప్రకటించారు దీనిలో కూడా కాళ్లు తెగిపోయినోళ్లు చేతులు విరిగిపోయిన వాళ్ళను ఐదు నిమిషాలు నిలపడడం కూడా చాతగాని వాళ్లను ఇన్వాల్యుడేషన్ చేయకుండా నాగా లేకుండా విధులు నిర్వహించిన వాళ్ల నుండి లక్షల రూపాయలు మెక్కి అన్ఫిట్ చేయించి మానవత్వాన్ని మంటగలిపారు మరి కూర్చోలేని నిలబడలేని దౌర్భాగ్యుల సంగతేమిటి పోరాడితే హక్కులు వస్తాయనే చరిత్ర సింగరేణికి కొత్తేమీ కాదు కానీ ఆ పరిస్థితులు నేడు ఎక్కడ కానరావడం లేదు సింగరేణిలో శరీకైన యువ కార్మికునికి సెల్ఫోన్ ముచ్చట తప్ప బాయి మీద ఉండే భౌతిక పరిస్థితులు పట్టడం లేదు కార్మిక సంఘాలు గనుల మీదకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తామంటే ఒక దిక్కు యాజమాన్యం అడ్డుకుంటుంది మరో దిక్కు యువ కార్మికుడు వినడానికి సిద్ధంగా ఉండడం లేదు నేటి పరిస్థితులు ఇట్లున్నాయి మరి సింగరేణి చరిత్ర పుటల నుండి మాయమైపోయే పరిస్థితుల నుండి ఈ బొగ్గు రంగాన్ని రక్షించుకునేది ఎవరు? భావితరాలకు ఉద్యోగాలను పొందాలంటే మార్గం ఏంటి? అనే భయానక పరిస్థితులు తెలంగాణ ప్రాంతానికి వెన్నెముకగా కొనసాగుతున్న బొగ్గు రంగం నేడు కనుమరుగయ్యే పరిస్థితులు స్పష్టమౌతూనే ఉన్నాయి. ఈ సంస్థను రక్షించుకోవాలంటే ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు దళారుల మాటలను తిప్పి కొట్టి ఈ సంస్థ రక్షణ కోసం యువత నడుం బిగించి కొట్లాడుతూనే ఈ బొగ్గు రంగ మీద ప్రజలకు హక్కు ఉంటుంది లేకపోతే ఇప్పటికే దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిన పాలకవర్గాల చేతుల్లోకి అధికార మార్పిడి జరిగితే సింగరేణి కాంట్రాక్టర్ల చేతుల్లో చేరిపోతుందనేది స్పష్టం అవుతూనే ఉంది కనుక కార్మిక వర్గం కోసమే మా పోరాటమని నిత్యం బాకా ఊదుతున్న నాయకులు కార్మికుల పక్షాన నిలిచి సంస్థ పరిరక్షణ కోసం నిస్వార్ధంగా పోరాడాలని అట్లయితేనే ఈ సంస్థ మనకు దక్కుతుందని లేదంటే అదాని అంబానీ లాంటి కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి దీనిపై ఆధారపడ్డ కుటుంబాలన్నీ ఆగమైపోతాయి ఇక్కడి కార్మికుల చెమట నెత్తురు కూడు తిన్న యువత గత చరిత్రను నెమరు వేసుకుంటే ఉద్యమానికి సిద్ధమైతే సంస్థను రక్షించుకోవడం పెద్ద సమస్య ఏమి కాదు ఓ యువత మేలుకో బువ్వ పెట్టిన సింగరేణినీ కాపాడుకో అనే పిలుపు ప్రతి ఒక్కరిలో గడప గడపకు తాకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కదిలి కథనరంగా దూకిన విధానాన్ని ఉనికిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని సింగరేణి ప్రాంత కుటుంబాలన్నీ ఆశతో ఆశయంతో ఎదురుచూస్తున్నాయి

