పెద్ద చెరువుకు గండి పడే ప్రమాదంఆరు నెలలుగా పట్టించుకోని అధికారులు.. గండి పడితే 200 ఎకరాలకు సాగునీరు కరువు.
పెద్దపల్లి .అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 16,
మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని పెద్ద చెరువుకు గండి పడే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు ఆరు నెలలుగా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టకు పలు చోట్ల బలహీనత ఏర్పడి గండి పడే పరిస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. చెరువుకు గండి పడితే సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందకుండా పోయే ప్రమాదం ఉందని తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని పౌర సమాచార సంక్షేమ సంఘం మంథని ఉపాధ్యక్షులు ఎల్కా సదానందం, ఉపసర్పంచ్ లక్ష్మితో పాటు గ్రామస్థులు మండిపడ్డారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చెరువుకు మరింత నీరు చేరితే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు స్పందించి చెరువు కట్టను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

