ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు..రూ.2.48 లక్షల నగదు స్వాధీన

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు..రూ.2.48 లక్షల నగదు స్వాధీన

📰 Generate e-Paper Clip

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు..రూ.2.48 లక్షల నగదు స్వాధీన

తిరుపతి. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆంధ్రప్రదేశ్. ఆగస్టు 18,

తిరుపతిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. దీంతో సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లలో కలకలం రేగింది. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు వివరాలకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మీదేవిని విచారించారు. నగదుతోపాటు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్‌ రికార్డులను, సంబంధిత దస్తావేజులను, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఏసీబీ తనిఖీలు కొనసాగుతుండడంతో కార్యాలయానికి వచ్చిన డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో వీరిని కూడా విచారిస్తున్నట్టు సమాచారం. డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఫిర్యాదులు రావడంతో తనిఖీలు జరిపామన్నారు. అన్‌ అకౌంటెడ్‌గా ఉన్న రూ2.48లక్షలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం జరిగిన 42 రిజిస్ట్రేషన్లను కూడా పరిశీలిస్తున్నామన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!