ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారిన రేవంత్ రెడ్డి.. పేదల భూములపై పడి కీచకుల్లా వ్యవహరిస్తున్న...

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారిన రేవంత్ రెడ్డి.. పేదల భూములపై పడి కీచకుల్లా వ్యవహరిస్తున్న సర్కార్: ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్.

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
‘ధరణి’ పోయినా ధోరణి మారలేదు.. ‘భూభారతి’ కాస్త పేదల పాలిట ‘భూహారతి’గా మారింది

హైడ్రా, పోలీసుల పహారాలో రాత్రికి రాత్రే పేదల భూములకు ఫెన్సింగ్ వేసి వేలానికి కుట్ర

కూకట్‌పల్లిలో రూ.20,000 కోట్ల IDL/గల్ఫ్ ఆయిల్ భూముల బదిలీ వెనుక ఫినిక్స్ కంపెనీ దందా

పేదలు, రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోం..
కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను కాపాడాల్సింది పోయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తరహాలో వ్యవహరిస్తూ లక్షల కోట్ల రూపాయల భూదందాకు తెరతీసిందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధరణి పోయినా ధోరణి మారలేదు

తెలంగాణ వస్తే భూ సమస్యలన్నీ తీరి పారదర్శకమైన చట్టం వస్తుందని ప్రజలు ఆశిస్తే, గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో పేద రైతుల హక్కులను కాలరాసిందని ఈటల విమర్శించారు. ధరణి రాకముందు పహాణీలలో ఉన్న 13 కాలమ్స్ (ముఖ్యంగా కబ్జా, కాస్తు కాలమ్స్) తొలగించడం వల్ల 50-70 ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్న దళితులు, గిరిజనులు, బీసీ పేద రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి, ఇప్పుడు ‘భూభారతి’ పేరుతో మరింత దారుణంగా పేద రైతాంగాన్ని అగాధంలోకి నెట్టిందని.. ‘ధరణి పోయినా ధోరణి మారలేదు, భూభారతి కాస్త పేదలకు భూహారతిగా మారింది’ అని ఎద్దేవా చేశారు.

హైడ్రా, పోలీసుల పహారాలో రాత్రికి రాత్రే భూముల కబ్జా:

కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పది అడుగులు ముందుకేసి భూముల వేలం ద్వారా దాదాపు రూ.10 లక్షల కోట్లు సమకూర్చుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారని ఈటల మండిపడ్డారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని నగర విస్తరణ ప్రాంతాల్లో వేల ఎకరాల పేదల భూములను హైడ్రా, వందల మంది పోలీసుల పహారాతో రాత్రికి రాత్రే ఫెన్సింగ్‌లు, గోడలు కట్టి డీల్స్‌కు అప్పగిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు గ్రామాలపై పడి కీచకుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సాగుతున్న
ప్రైవేట్ భూముల్లో 12 ఏళ్లు కౌలు ఉంటే ‘సెక్షన్ 38E’ కింద హక్కులు వస్తుంటే.. బడంగ్‌పేట్‌లో ఐదు తరాలుగా (78 సంవత్సరాలుగా) 46 మంది రైతులు సాగుచేసుకుంటున్న 45 ఎకరాల 16 గుంటల భూమిని ప్రభుత్వ భూమి పేరుతో లాక్కుంటున్నారు.

దుండిగల్ & బోరంపేట: దుండిగల్ సర్వే నం. 452, 453లలోని 400 ఎకరాల్లో 500 మంది రైతులు, బోరంపేట సర్వే నం. 166లోని 440 ఎకరాల్లో 150 మంది రైతులు 80 ఏళ్లుగా సాగు చేసుకుంటుంటే బలవంతంగా గుంజుకుంటున్నారు. బోరంపేట సర్వే నం. 472లోని 30 ఎకరాలకు ప్రీకాస్ట్ గోడలు నిర్మించారు.

బొమ్మరాజుపేట (శామీర్‌పేట్): 1965 నాటి 1,049 ఎకరాల భూమి ధరణి లోపాల వల్ల వివాదంలోకి వెళ్లగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 24 గంటల్లోనే పేర్లు మార్చి రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించారు.

శంషీగూడా (ఎల్లమ్మబండ): సర్వే నం. 57లోని 333 ఎకరాల్లో పేదలు, జర్నలిస్టులకు ఇచ్చిన 176 ఎకరాలు కాకుండా మిగిలిన 90 ఎకరాల భూమిని (విలువ సుమారు రూ.3,000 కోట్ల నుండి రూ.4,000 కోట్లు) కోర్టు కేసులను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులతో సెటిల్‌మెంట్ చేసుకుని దోచుకుంటున్నారు.

కూకట్‌పల్లి (గల్ఫ్ ఆయిల్ / IDL భూములు): గతంలో ఇండియన్ డిటనేటర్స్ లిమిటెడ్ (IDL) పేరిట ఉన్న 330 ఎకరాల పైచిలుకు భూమిని (విలువ రూ.20,000 కోట్లు) ఫినిక్స్ కంపెనీ మధ్యవర్తిత్వంతో చేతులు మార్చారు. ఇక్కడి నుంచే 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అక్రమ డబ్బు ఖర్చు పెట్టిందని, ప్రస్తుతం ఇక్కడ ఒక్కో విల్లాను రూ.25 కోట్ల నుండి రూ.30 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

బహదూర్ గూడ (ఫ్యూచర్ సిటీ): 70-80 ఏళ్లుగా గులాబీ తోటలు సాగుచేసుకుంటున్న రైతుల నుంచి 650 ఎకరాలను హైడ్రా బలగాలతో లాక్కోవాలని చూస్తే, ప్రజలు కారప్పొడి చల్లి తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!