మంచిర్యాలలో టిజిఈజేఏసి ఆధ్వర్యంలో రేపు ‘మహా ధర్నా’
మంచిర్యాల జిల్లా అర్జున్ సమాచారం ప్రతి నిధి:
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టిజిఈజేఏసి) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రేపు (ఆగస్టు 27, గురువారం) మహా ధర్నా నిర్వహించనున్నట్లు టిజిఈజేఏసి మంచిర్యాల జిల్లా నాయకులు తెలిపారు.
టిజిఈజేఏసి రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు మరియు రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. నస్పూర్ లోని సమగ్ర జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడిఓసి) వద్ద గురువారం ఉదయం 11:00 గంటలకు ఈ మహా ధర్నా ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా టిజిఈజేఏసి మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి మరియు సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి మాట్లాడుతూ… ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహా ధర్నా కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు.

