ePaper
Thursday, August 27, 2026
ePaper
Homeతెలంగాణ12వ వేతన ఒప్పందాన్ని పక్కనపెట్టి 25 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి .

12వ వేతన ఒప్పందాన్ని పక్కనపెట్టి 25 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి .

📰 Generate e-Paper Clip

12వ వేతన ఒప్పందాన్ని పక్కనపెట్టి 25 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి .

అర్జున్ సమాచారం ప్రతినిధి బెల్లంపల్లి ఆగస్టు 26,

అని కొన్ని కార్మిక సంఘాలు అనడం, కార్మిక వర్గాన్ని మోసం చేయటమే,–కార్మిక వర్గంపై చిత్తశుద్ధి ఉంటే సమ్మెకు పిలుపు ఇవ్వండి-విప్లవ కార్మిక సంఘాల డిమాండ్,సింగరేణి కార్మికుల భవిష్యత్తుపై స్పష్టమైన వైఖరి అవసర.

సింగరేణి బొగ్గు గని కార్మికులకు 12వ వేతన ఒప్పందం అమలు కావాల్సిన సమయంలో, పూర్తి స్థాయి వేతన ఒప్పందం కోసం పోరాడకుండా కేవలం 25 శాతం ఇంటీరీయం రిలీఫ్ (తాత్కాలిక ఉపశమనం) ఇవ్వాలని కొన్ని కార్మిక సంఘాలు ప్రకటించడం కార్మిక వర్గంలో చర్చనీయాంశంగా మారింది. కార్మికుల వేతనాలు, అలవెన్సులు, ఇతర సేవా ప్రయోజనాలపై సమగ్ర చర్చ జరిపి శాశ్వత పరిష్కారం చూపాల్సిన తరుణంలో, తాత్కాలిక రిలీఫ్‌ను ప్రధాన డిమాండ్‌గా ముందుకు తేవడం సరైన విధానం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

11వ వేతన ఒప్పందం కాలపరిమితి ముగిసిన తర్వాత, 12వ వేతన ఒప్పందం 2026 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ చర్చలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంపై కార్మికుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఇటీవల కూడా 12వ వేతన ఒప్పందం అమలులో జాప్యంపై కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టినట్లు తెలిసిందే.

ఇంటీరియం రిలీఫ్ అనేది శాశ్వత వేతన ఒప్పందానికి ప్రత్యామ్నాయం కాదు. ఇది తుది వేతన ఒప్పందం జరిగే వరకు కార్మికులకు తాత్కాలిక ఆర్థిక ఉపశమనంగా మాత్రమే ఉండాలి. గత వేతన ఒప్పందాల చరిత్రలో కూడా తుది ఒప్పందం ఆలస్యమైన సందర్భాల్లో ఇంటీరీయం రిలీఫ్ చెల్లించిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే చివరకు పూర్తి స్థాయి వేతన ఒప్పందంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందే.

కాబట్టి కార్మిక సంఘాలు “12వ వేతన ఒప్పందం వద్దు… 25 శాతం ఇంటీరీయం రిలీఫ్(IR )చాలు” అనే భావన కలిగేలా వ్యవహరించకుండా, ముందుగా పూర్తి స్థాయి వేతన ఒప్పందం కోసం ఐక్యంగా పోరాడాలని కార్మికులు కోరుతున్నారు. 25 శాతం ఇంటిరియం రిలీఫ్(IR )ఇవ్వాలనుకుంటే అది కూడా 12వ వేతన ఒప్పందానికి అదనంగ, తుది ఒప్పందం వరకు పోరాడాల్సిన బాధ్యత జాతీయ కార్మిక సంఘాలపై ఉంది. అయినప్పటికీ గతంలో11వ ఏజ్ బోర్డ్ జరిగిన అగ్రిమెంట్లలో కొన్ని అంశాలను ఇప్పటివరకు అమలు చేయలేదు వాటిని అమలు చేయించవలసిన జాతీయ కార్మిక సంఘాలు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండడం సరైనది కాదని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా51 శాతం కేంద్ర ప్రభుత్వం వాటా49 శాతం ఉంది కాబట్టి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకొని 12వ వేతన ఒప్పందాన్ని అమలు చేయించాలని విప్లవ కార్మిక సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిమాండ్ చేస్తున్నాం. అలాగే 12వ వేతన ఒప్పందం జరిగే వరకు కార్మిక వర్గం పోరాటానికి సిద్ధంగా ఉండాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో T. మని రామ్ సింగ్ (TNTUC) సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, M. పోచ మల్లు, శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (AIFTU) అంబాల మహేందర్ సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు (SGKS) గజ్జె దుర్గయ్య, బెల్లంపల్లి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్గనైజర్,ర్. రాజ్ కుమార్, Aiftu జిల్లా నాయకులు, గోగర్ శంకర్,Tuci రాష్ట్ర నాయకులు లక్ష్మి, కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!