ePaper
Thursday, August 27, 2026
ePaper
Homeతెలంగాణఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం.మంచిర్యాలలో గెజిటెడ్ అధికారుల జేఏసీ రెండవ సన్నాహక సమావేశం..

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం.మంచిర్యాలలో గెజిటెడ్ అధికారుల జేఏసీ రెండవ సన్నాహక సమావేశం..

📰 Generate e-Paper Clip

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం.మంచిర్యాలలో గెజిటెడ్ అధికారుల జేఏసీ రెండవ సన్నాహక సమావేశం..

అర్జున్ సమాచారం. ఆగస్టు 26. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల, ఆగస్టు 26: ఉద్యోగులఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల జేఏసీ మంచిర్యాల జిల్లా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.తెలంగాణ గెజిటెడ్ అధికారుల జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలోని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో రెండవ సన్నాహక సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, కార్మిక సంఘాలు, శాఖల ప్రతినిధులు హాజరయ్యారు.సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రధాన డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘాలన్నీ సమిష్టిగా కృషి చేయాలని తీర్మానించారు.సమావేశంలో ప్రధానంగా రెండవ వేతన సవరణ సంఘం సిఫారసులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లుల చెల్లింపునకు ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసి బకాయిలను త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేశారు. సహకార పెన్షన్ విధానానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు, సంఘాలకు తగిన గుర్తింపు కల్పించి, వాటి సమస్యలను అధికారికంగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాలన్నీ ఉద్యోగుల ఆర్థిక, సామాజిక, సేవా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కీలకమైన సమస్యలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిగణించి చర్చల ద్వారా తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై సంఘాల నాయకులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో జేఏసీ జిల్లా సహ అధ్యక్షులు శ్రీనివాస్ రావు దేశ్‌పాండే, బట్టారి వెంకటేశ్వర్లు, బెజ్జంకి జగన్, సుమిత్, పుప్పాల హనుమంతరావు, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, దుర్గా ప్రసాద్, భూముల రామ్మోహన్, డి. వేణుగోపాల్, పత్తి సత్తయ్య, పొడేటి సంజీవ్, ఉపాధ్యక్షులు బొడ్డు శ్రావణ్ కుమార్, సుధాకర్, సూరినేని గంగాధర్, ఒడిగ కృష్ణ, బి. రవీందర్, ఎస్. కిషన్, ఏ. సునీత, నాగుల గోపాల్, ప్రచార కార్యదర్శి రాంకుమార్, కార్యదర్శులు సత్యనారాయణ, తిరుపతి, రాసమల్ల రవి, పొలస సత్యనారాయణ, కుమారస్వామి, జయకృష్ణ, సహకార పెన్షన్ విధాన సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఏ. రాజేందర్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!