ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిసత్తాచాటిన అన్నమయ్య జిల్లా క్రీడాకారులు

సత్తాచాటిన అన్నమయ్య జిల్లా క్రీడాకారులు

📰 Generate e-Paper Clip

రాయచోటి,అర్జున్ సమాచారం:
అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లోఅన్నమయ్య జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటారు.వివిధ క్రీడాంశాల్లో రాణించిన క్రీడాకారులుబ్యాడ్మింటన్‌లో మోతుకూరి కళ్యాణి, కందుకూరి లక్ష్మీ సింధూర ద్వితీయ స్థానాలు సాధించి రజత పతకాలు పొందారు. బాక్సింగ్‌లో సిరివెలు నిఖిల్ దేవ్ నాయుడు ద్వితీయ స్థానం సాధించగా, అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో సుంకు గంగాధర్ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ పతకాలు సాధించిన క్రీడాకారులు తమ మెడల్స్‌తో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారిని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిసి తమ విజయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారులను అభినందించి, వారి ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

క్రీడాకారులకు అవసరమైన సహకారం

అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.పతకాలు సాధించిన క్రీడాకారులుమోతుకూరి కళ్యాణి – బ్యాడ్మింటన్ – ద్వితీయ స్థానంకందుకూరి లక్ష్మీ సింధూర – బ్యాడ్మింటన్ – ద్వితీయ స్థానం సిరివెలు నిఖిల్ దేవ్ నాయుడు – బాక్సింగ్ – ద్వితీయ స్థానం
సుంకు గంగాధర్ – జావెలిన్ త్రో – ద్వితీయ స్థానం ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, క్రీడాకారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఒకే వేదికపై అందించేందుకు ‘నైపుణ్యం పోర్టల్’ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నమయ్య జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి హెచ్. దొన్నప్ప  తెలిపారు.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!