ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ఘనంగా 'అమిగోస్ టి.పి.ఎల్' క్రీడా సంబరం ప్రారంభం... ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన...

ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ఘనంగా ‘అమిగోస్ టి.పి.ఎల్’ క్రీడా సంబరం ప్రారంభం… ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన షేక్. మొహమ్మద్ జాకీర్

📰 Generate e-Paper Clip

రేణిగుంట,అర్జున్ సమాచారం:
తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో “అమిగోస్ తిరుపతి ప్రిమియర్ లీగ్ – మొదటి విడత” క్రికెట్ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి, ఈ క్రీడా వేడుకకు తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ ముఖ్య అతిథులుగా హాజరై దివ్య జ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు, సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా, ఇందులో రెండో విభాగంలో లేని జట్లు (మొదటి విభాగం జట్లు) రాము ఎలెవన్ ఏర్పేడు, సూర్య మరియు అచ్యుత్ క్రికెట్ అకాడమీ తిరుమల, అక్షర ఈవెంట్స్ మరియు క్యాటరర్స్ శ్రీకాళహస్తి, డి.సి.సి వెంకటగిరి, మరియు ఆర్‌కే మేకప్ స్టూడియో మరియు అకాడమీ తిరుపతి టైగర్స్ అనే 5 జట్లు ఉన్నాయి, ఈ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన విజేత జట్టుకు లక్షన్నర రూపాయల (₹1,50,000/-) నగదు బహుమతితో పాటు అందమైన విజేత కప్పును అందజేస్తారు, ఇకపోతే ఈరోజు ఉదయం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన తొలి ఆటలో ఎస్‌కేఎస్ తిరుచానూరు మరియు సన్‌రైజర్స్ రేణిగుంట జట్లు హోరాహోరీగా తలపడగా, ఈ రోజటి లీగ్ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ రేణిగుంట జట్టు తరఫున ఆడిన జబ్బార్ ట్రస్ట్ అధినేత షేక్ ఫరీద్ బాబా కుమారుడు, యువ ఆల్‌రౌండర్ షేక్. మొహమ్మద్ జాకీర్. అత్యంత అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచి మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాడు, మైదానంలో పదునైన బౌలింగ్‌తో శత్రు జట్టుకు చెందిన 3 కీలక వికెట్లను నేలకూల్చడమే కాకుండా, సమయస్ఫూర్తితో కూడిన ప్రదర్శనతో సన్‌రైజర్స్ రేణిగుంట జట్టును విజయతీరాలకు చేర్చి ఈరోజు మ్యాచ్‌ను గెలిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు, గతంలో జరిగిన మునుపటి అంతిమ సమరంలో కూడా ఇదే రీతిలో మెరిసిన షేక్. మొహమ్మద్ జాకీర్., ఈరోజు మ్యాచ్‌లోనూ తన విశేష ప్రతిభతో రేణిగుంట కీర్తి ప్రతిష్టలను తిరుపతి జిల్లా స్థాయిలో మారుమోగేలా చేయడంతో రేణిగుంట ప్రజలు, క్రీడాభిమానులు మరియు ప్రముఖులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!