ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeతెలంగాణరాజాపూర్‌లో ఫారెస్ట్ అధికారిణిని అడ్డుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్

రాజాపూర్‌లో ఫారెస్ట్ అధికారిణిని అడ్డుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
సెప్టెంబర్ 2 | పెద్దపల్లి:
రామగిరి మండలం రాజాపూర్ (ఆదివారంపేట):
రామగిరి ఓపెన్‌కాస్ట్–II ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు సంబంధించి ఇళ్లు, ఇతర నిర్మాణాలు, చెట్ల విలువను అంచనా వేసేందుకు వచ్చిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి ఎస్.కె. నహీద్‌ను రాజాపూర్ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ అడ్డుకున్నట్లు సమాచారం.
అధికారిక లేఖ ప్రకారం ఆదివారంపేట గ్రామ పరిధిలోని 14.08 ఎకరాల భూమికి సంబంధించి ఇళ్లు, నిర్మాణాలు, చెట్ల విలువను అంచనా వేసి, పరిహారం చెల్లింపునకు అవసరమైన ఎస్టిమేషన్‌ను సిద్ధం చేయాలని ఫారెస్ట్ అధికారులను కోరినట్లు తెలుస్తోంది.
అయితే గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఇళ్లకు సంబంధించిన హక్కులు, అర్హతలు, పరిహారం, సర్వే ప్రక్రియపై పూర్తి స్థాయి స్పష్టత లేకుండానే కొలతలు చేపట్టడంపై సర్పంచ్, ఉపసర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రతి ప్రభావిత కుటుంబానికి న్యాయమైన పరిహారం అందేలా పూర్తి స్థాయి రికార్డులను పరిశీలించిన అనంతరం మాత్రమే సర్వే, విలువ నిర్ధారణ ప్రక్రియను కొనసాగించాలని గ్రామ ప్రజల తరఫున సర్పంచ్, ఉపసర్పంచ్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
భూసేకరణ ప్రక్రియలో ప్రభావిత కుటుంబాల హక్కులు, పరిహారం, అర్హతలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!