ePaper
Sunday, September 6, 2026
ePaper

📰 Generate e-Paper Clip

ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై జేపీసీ.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5, (అర్జున్ సమాచారం ప్రతినిధి.)

విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026 పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. బిహార్ బీజేపీ ఎంపీ, లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్ డాక్టర్ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన జాయింట్ కమిటీ, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు, పలు అంశాలను పరిశీలించనుంది.  FCRA జాయింట్ పార్లమెంటరీ కమిటీలో పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు. బీజేపీ నుంచి డాక్టర్ సంజయ్ జైస్వాల్, భత్రృహరి మహతాబ్, తేజస్వి సూర్య, కమలేష్ జంగ్డే, ముఖేష్ కుమార్ చంద్రకాంత్ దలాల్, డాక్టర్ నిషికాంత్ దూబే, విష్ణు దయాళ్ రామ్, అనంత్ నాయక్, అరవింద్ ధర్మపురి సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ తరపున ఆంటో ఆంటోనీ, కెప్టెన్ విరియాటో ఫెర్నాండెజ్, మహ్మద్ హమ్దుల్లా సయీద్, కాళీ చరణ్ ముండా ఉన్నారు.ఈ ప్యానెల్‌లోని ఇతర లోక్‌సభ ఎంపీలలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జియా-ఉర్-రెహమాన్, టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ, డీఎంకేకు చెందిన ఎ. రాజా, టీడీపీకి చెందిన లావు శ్రీ కృష్ణ దేవరాయలు, శివసేనకు చెందిన నరేష్ గణపత్ మస్కే, జేడీ(యూ)కి చెందిన కౌశలేంద్ర కుమార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్, ఎన్‌సీపీ-ఎస్పీకి చెందిన సుప్రియా సూలే, ఐయూఎంఎల్‌కు చెందిన ఈటీ మహమ్మద్ బషీర్ ఉన్నారు.జాయింట్ కమిటీలో రాజ్యసభ ఎంపీలు సి.సదానందన్ మాస్టర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, ఉజ్వల్ దేవ్‌రావ్ నికమ్, డాక్టర్ అల్కా గుర్జార్, సత్ పాల్ శర్మ, ప్రఫుల్ పటేల్, సంజయ్ కుమార్ ఝా, క్రిస్టోఫర్ మాణికం, డాక్టర్ మేనకా గురుస్వామి, పి.విల్సన్ ఉన్నారు.
జాబితా
మొత్తం – 31 ఎంపీలు
లోక్‌సభ ఎంపీలు – 21  
రాజ్యసభ ఎంపీలు  – 10  
ఎన్‌డీఏ: 19 మంది ఎంపీలు (బీజేపీ – 14, జేడీయూ – 2, టిడిపి – 1, శివసేన – 1, ఎన్సీపీ – 1).  
విపక్షాలు: 12 మంది ఎంపీలు (కాంగ్రెస్ – 5, తృణమూల్ కాంగ్రెస్ – 2, డీఎంకే – 2, ఎస్పీ – 1, ఐయూఎంఎల్ – 1, ఎన్‌సీపీ-శరద్ పవార్ – 1విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం భారత్ లోకి విదేశీ నిధులు, వస్తువులు, విదేశీ సెక్యూరిటీల రాక, వినియోగాన్ని నియంత్రిస్తుంది. జాతీయ భద్రత, శాంతిభద్రతలు,  ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వచ్చే విదేశీ నిధులను ఉపయోగించకుండా చూడటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత FCRA చట్టం 2010 నాటిది, దీనిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ చట్టం ప్రకారం, విదేశీ విరాళాలు స్వీకరించడానికి ఎన్జీఓలు, ట్రస్టులు, సంస్థలు, ఇతర అర్హతగల సంస్థలకు ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ లేదా అనుమతి అవసరం. వారు స్వీకరించిన విదేశీ నిధుల వినియోగం, అకౌంటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి అందించాలి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!