గుంజపడిగ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మండలం గుంజపాడి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం.
మంథని:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19
మండలం పరిధిలోని గుంజపడిగ గ్రామంలో ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ఉపసర్పంచ్ ఎల్లక లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొని అర్హులైన గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు అందుతున్న ప్రయోజనాలను సక్రమంగా పొందేందుకు రేషన్ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉదరి కవిత, దేవాలా లక్ష్మి, బోగే రాజేశ్వరి, బోగే సంపత్, దేవరకొండ పోషం, సింగిల్ విండో డైరెక్టర్ దేవాలా విజయ్ కుమార్, గ్రామ జీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్మార్ట్ రేషన్ కార్డులను స్వీకరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

