ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeఆరోగ్యంఒక్క చుక్క రక్తం.. ఒక ప్రాణానికి జీవనాధారం.రక్తదానంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.

ఒక్క చుక్క రక్తం.. ఒక ప్రాణానికి జీవనాధారం.రక్తదానంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.

📰 Generate e-Paper Clip

ఒక్క చుక్క రక్తం.. ఒక ప్రాణానికి జీవనాధారం.రక్తదానంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 19. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలజిల్లా:ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో భాగంగా శనివారం రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, సికిల్‌ సెల్‌ వ్యాధిగ్రస్తులు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు రక్తం అవసరం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
జిల్లాలో సెప్టెంబరు 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు రక్తదానంపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 1వ తేదీన జిల్లాలోని పలు ప్రాంతాల్లో రక్తదాన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
“మానవత్వం చాటుదాం.. ఒక్క చుక్క రక్తం దానం చేసి ప్రాణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ప్రజల్లో రక్తదాన ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది ప్రజలకు రక్తదానంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రమ్య, డాక్టర్ అమన్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, పుట్ట సత్తయ్య, వెంకటేశ్వర్లు, భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి శ్రీ మహేందర్, వారి సిబ్బంది, తలసీమియా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, వారి సిబ్బంది, వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఐసీటీసీ సిబ్బంది, దిశా సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!