కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామగుండం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు, భక్తులతో కలిసి గణపతి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రామగుండం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గణనాథుని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం 8వ కాలనీలోని ఓసిపి 3 బేస్ వర్క్ షాప్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమములో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి, నిర్వాహకులను అభినందించారు.కార్మిక కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజల్లో ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించడానికి దోహదపడుతున్నాయని కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో బి ఎం ఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య , గట్టు శ్రీనివాస్,8 ఇంక్లైన్ కాలనీ మండల అధ్యక్షులు ఆకుల శశి,బీజేపీ సీనియర్ నాయకులు మూకిరి రాజు,ఆకుల కుమార్ గౌడ్,కండేసాగర్,గంధం శంకర్,చొప్పరి స్వామి,జక్కన బాలు,మీస వికాస్, పైడిపల్లి విజయ్ గౌడ్, చరణ్, బడుగు జలంధర్, గోపు రామన్న, మేడం రాజు తదితరులు పాల్గొన్నారు..
==============================

