ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeజగిత్యాలసింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.

📰 Generate e-Paper Clip

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.

అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 23:జగిత్యాల.డెస్క్.

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ఇటీవల మృతి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా సింహాచలం జగన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్ పార్టీకి అందించిన సేవలను పుట్ట మధూకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

జగన్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!