శ్రీ సిద్ధి వినాయక లడ్డూ వేలంలో రూ.20,116 ,అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్న గడియారం అనూహ్య–అనురాగ్ దంపతులు.
మంచిర్యాల,నస్పూర్: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 23
.టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నస్పూర్లో నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి లడ్డూ వేలం పాటలో గడియారం అనూహ్య–అనురాగ్ దంపతులు రూ.20,116కు లడ్డూను దక్కించుకున్నారు.
టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా, హౌసింగ్ సొసైటీ అధ్యక్షురాలు గడియారం పల్లవి శ్రీహరి దంపతుల కుమార్తె, అల్లుడు అయిన గడియారం అనూహ్య–అనురాగ్ దంపతులు వేలం పాటలో పాల్గొని అత్యధికంగా రూ.20,116 పాట పాడి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు గడియారం పల్లవి శ్రీహరి దంపతులను, వారి కుటుంబ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్, హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు సైండ్ల మొండయ్య, నాయకులు పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సతీష్ కుమార్, తిరుపతి రెడ్డి, సునీత, టి. తిరుపతి, జె. రాంకుమార్, ప్రసాద్, ఉషన్నతో పాటు టీఎన్జీవో కాలనీ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

