ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeస్పోర్ట్స్మంగంపల్లిలో జిల్లాస్థాయి SGF అండర్‌-17 కబడ్డీ పోటీలు. 15 మండలాల నుంచి పోటీల్లో పాల్గొన్న బాలబాలికలు

మంగంపల్లిలో జిల్లాస్థాయి SGF అండర్‌-17 కబడ్డీ పోటీలు. 15 మండలాల నుంచి పోటీల్లో పాల్గొన్న బాలబాలికలు

📰 Generate e-Paper Clip

వనపర్తి,అర్జున్ సమాచారం:

క్రీడలకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.వ
నపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్‌-17 కబడ్డీ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి.బాలుర విభాగంకబడ్డీ మొదటి బహుమతి- మదనపూర్.రెండవ బహుమతి- కొత్తకోట.బాలికల విభాగం.మొదటి బహుమతి-ఘనపూర్రెండవ బహుమతి-పెబ్బేరు.జిల్లా పరిధిలోని  అమరచింత, ఆత్మకూర్, చిన్నంబావి, ఘనపూర్, గోపాల్‌పేట, కొత్తకోట, పానగల్, పెబ్బేరు, పెద్దమందడి, మదనాపూర్, రేవల్లి, వనపర్తి, వీపనగండ్ల, శ్రీరంగాపూర్, ఏదుల మండలాలకు చెందిన అండర్‌-17 బాలబాలికలు పాల్గొన్నారు.ఉత్కంఠభరితంగా సాగిన బాలుర కబడ్డీ పోటీల్లో మదనాపూర్ జట్టు ప్రథమ బహుమతి సాధించగా, కొత్తకోట జట్టు ద్వితీయ బహుమతి కైవసం చేసుకుంది.బాలికల విభాగంలో ఘనపూర్ జట్టు ప్రథమ బహుమతి సాధించి విజేతగా నిలవగా పెబ్బేరు జట్టు ద్వితీయ బహుమతి సాధించింది.ఈ క్రీడలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారం.విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  ఈ క్రీడా పోటీలకు పూర్తి సహాయ సహకారాలు అందించారు.గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు క్రీడల్లో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రతిభావంతులైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించేందుకు  ఎమ్మెల్యే సహాయ సహకార అందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.పాఠశాల స్థాయిలో నిర్వహించే ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో కేవలం క్రీడా నైపుణ్యాన్నే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెంపొందించేందుకు ఈ క్రీడలు దోహదపడతాయి.15 మండలాల పీడీల పర్యవేక్షణలో పోటీలు ఖిల్లా ఘణపురం మండల PET చిట్టెమ్మ సమన్వయంతో పోటీలు నిర్వహించగా, 15 మండలాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు (PDలు), క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించారు. పోటీల నిర్వహణలో క్రీడా ఉపాధ్యాయులు, పీడీలు సమన్వయంతో వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, SGF ఇన్‌చార్జి కుమార్, స్థానిక సర్పంచ్ రమేష్ నాయక్, మంగంపల్లి గ్రామపెద్ద వెంకటరామిరెడ్డి, మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వనపర్తి మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, MPDO పరిణతి, రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 15 మండలాల పీడీలు, క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.మంగంపల్లి వేదికగా నిర్వహించిన ఈ పోటీలు వనపర్తి జిల్లాలో పాఠశాల స్థాయి క్రీడలకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, భవిష్యత్తులో జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటే క్రీడాకారులను వెలికితీసేందుకు దోహదపడనున్నాయి.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!