హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్లో సెప్టెంబర్ 24న టీజీ SAFEకు చెందిన 8 బృందాలు 15 రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, ఎలుకల విసర్జితాలతో పాటు తీవ్ర అపరిశుభ్రతను గుర్తించాయి.
గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్రమైన పాత్రలు, సరిగా నిర్వహించని డ్రైనేజీలు, స్టోరేజ్-లేబులింగ్ లోపాలను అధికారులు గుర్తించారు. కల్తీ అనుమానంతో 16 నమూనాలను సేకరించారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి, వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. మరో 5 సంస్థలకు లోపాల సవరణ కోసం ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు.
బాచుపల్లిలోని లక్కీ రెస్టారెంట్లో భారీగా బొద్దింకలు, అపరిశుభ్ర పరిస్థితులతో పాటు FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించి మూసివేశారు. తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు పారబోశారు.
=========================

