మహబూబాబాద్,అర్జున్ సమాచారం:
ఇనుగుర్తి నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో, సత్తూరి యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
=====================
ఇనుగుర్తి లో బీఆర్ఎస్ లో భారీ చేరికలు
RELATED ARTICLES

