ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిరామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మహిళా చైతన్యానికి,...

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక: సీపీ అంబర్ కిషోర్ ఝా

📰 Generate e-Paper Clip

గోదావరిఖని:
అర్జున్ సమాచారం:

తెలంగాణ వీరవనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,ఐపీఎస్, అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పెత్తందార్ల దురాగతాలకు, నాటి నిరంకుశ రజాకార్లు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో పోరాడిన తీరు అందరికీ ఆదర్శనీయమని అన్నారు.ఆమె సాగించిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక అని,ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీ అన్నారు.చాకలి ఐలమ్మ త్యాగం, పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని పేదలు,బలహీన వర్గాలు, బాధితులకు అండగా నిలిచి సేవ చేయాలని, పోలీసులుగా ప్రజలకు భరోసా కల్పించడం, బాధితులకు న్యాయం అందించడం మన బాధ్యత అని అన్నారు.ఈ జయంతి సందర్భంగా ప్రజాసేవకు మరింత అంకితభావంతో పనిచేయాలని,అదే చాకలి ఐలమ్మకు మనం అందించే నిజమైన నివాళి అని సీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏఓ శ్రీనివాస్,ఆర్‌ఐలు శేఖర్,సీసీ సందీప్, సీపీఓ సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!