నర్సింహులపేట:అర్జున్ సమాచారం:
గుడుంబా తయారీ, విక్రయాలపై నర్సింహులపేట పోలీసులు కొరడా ఝుళిపించారు. కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం గోపా తండా గ్రామపంచాయతీ పరిధిలోని చింతల తండా, అమిరియా తండా, కొత్త తండాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 2 వేల లీటర్ల బెల్లం వాష్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే 3 క్వింటాళ్ల నల్ల బెల్లం, 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది వ్యక్తుల వద్ద ఈ పదార్థాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తుల పూర్వ నేర చరిత్ర, బైండ్‌ఓవర్ వివరాలను పరిశీలించి, చట్ట ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో తొర్రూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గణేష్‌తో పాటు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
========================
గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు నర్సింహులపేట:
RELATED ARTICLES

