కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
సింగరేణి కార్మికుల సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై హైదరాబాద్ ప్రగతి భవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ రావు, గడ్డం వినోద్, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, కోరెం కనకయ్య, రామదాసు, సాంబశివరావు, సింగరేణి యాజమాన్యం తరఫున సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు, డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, తిరుమల రావు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డా. బి.జనక్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆ సమావేశంలో వచ్చిన సానుకూల స్పందన, ప్రభుత్వ హామీల వివరాలను కార్మికులకు తెలియజేస్తూ మంగళవారం ఉదయం సింగరేణి ఆర్జీ-3, ఓసీ-1 గని ఆపరేషన్ సైట్ ఆఫీస్ లో ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ 2025-26 లాభాల్లో 35% లాభాల వాటాను దసరా లోపు కార్మికుల ఖాతాల్లో జమ చేయడం, కారుణ్య నియామకాలు, ప్రతి నెలా మెడికల్ బోర్డుల నిర్వహణ, సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై పన్ను మినహాయింపు, అలియాస్ నేమ్స్ సమస్యను వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం, పెండింగ్ కోర్టు/విజిలెన్స్ కేసులు, కొత్త బొగ్గు గనుల కేటాయింపు, జెన్కో/ట్రాన్స్‌కో బకాయిలు, 33 మంది వైద్యుల నియామకం తదితర 12 కీలక అంశాలపై దసరాలోపు నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “సింగరేణి కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చగలిగే సత్తా, చిత్తశుద్ధి కలిగిన ఏకైక యూనియన్ ఐఎన్టీయూసీ మాత్రమే” అని తెలియజేస్తూ, కార్మికుల హక్కుల కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గని ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి ప్రవీణ్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, సారయ్య, నరేష్ కుమార్, వినయ్, సతీష్, రంగా దిలీప్, చిట్టబోయిన శ్రీనివాస్, కనకయ్య, జహీర్, సమ్మయ్య, ఆనంద్, గంధం శ్రీనివాస్, నాగరాజు, రవీందర్, రాజన్న, రఘులతోపాటు ఆర్జీ-3 ఓసీ-1 కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
==========================
సింగరేణి కార్మికుల సమస్యపై మంత్రుల సమీక్ష ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్
RELATED ARTICLES

