ePaper
Friday, October 2, 2026
ePaper
Homeతెలంగాణమహబూబాబాద్మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ...

మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎస్పీ డా. శబరీష్,

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్, అక్టోబర్ 2:
:అర్జున్ సమాచారం:
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్, పి., ఐ.పి.ఎస్. ముఖ్య అతిథిగా విచ్చేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను, అహింస, సత్యం, శాంతి వంటి ఆయన అమూల్యమైన సిద్ధాంతాలను స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలు నేటి ఆధునిక పోలీసు వ్యవస్థకు ఎంతో మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలీసు సిబ్బంది గాంధీజీ జీవితం నుండి స్ఫూర్తి పొంది, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధతతో, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, మత సామరస్యం మరియు ప్రజా రక్షణ కోసం పోలీసులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. ప్రతి పౌరుడి హక్కులను గౌరవిస్తూ, సామాజిక న్యాయం మరియు సమానత్వం అనే గాంధీయ సూత్రాలకు అనుగుణంగా ప్రజలతో మమేకం కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో  మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘపతి రెడ్డి, ఆర్.ఐలు భాస్కర్, నాగేశ్వర్రావు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!