ePaper
Wednesday, October 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి తిరుమ‌ల‌,

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి తిరుమ‌ల‌,

📰 Generate e-Paper Clip

తిరుమ‌ల‌,అర్జున్ సమాచారం:
భారత ఉప రాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్ సోమ‌వారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉప రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు ఉప రాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ ఈవో  ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో  మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
తరువాత ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అటు పిమ్మట శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ ఈవో, అద‌న‌పు ఈవో స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు.
ఉప రాష్ట్రపతి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి వారిని కూడా అనంతరం దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి  అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ,టిటిడి బోర్డు సభ్యులు  రామ్మూర్తి, దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, పలువురు రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు  పాల్గొన్నారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!