ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeతెలంగాణబాలల హక్కులు, సమస్యలపై అవగాహన కల్పించిన న్యాయ సేవాధికార సంస్థపిల్లలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం...

బాలల హక్కులు, సమస్యలపై అవగాహన కల్పించిన న్యాయ సేవాధికార సంస్థపిల్లలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

📰 Generate e-Paper Clip

బాలల హక్కులు, సమస్యలపై అవగాహన కల్పించిన న్యాయ సేవాధికార సంస్థ
పిల్లలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

మంథని:అర్జున్ సమాచారం ,నవంబర్ 14 . రిపోర్టర్.

గుంజపడుగు: బాలల హక్కులు, వారి సమస్యల పరిష్కారం కోసం న్యాయ సేవాధికార సంస్థలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పారా లీగల్ వాలంటీర్ ఎల్క సదానందం సూచించారు.
నేడు బాలల దినోత్సవం సందర్భంగా గుంజపడుగు గ్రామంలోని రైతు వేదికలో గ్రామ సర్పంచ్ సంధ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలకు సంబంధించిన సమస్యలు, హక్కులు, చట్టపరమైన అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
పిల్లలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురైనా ఉచితంగా న్యాయ సలహాలు, సహాయం పొందేందుకు మండల, జిల్లా స్థాయిల్లో న్యాయ సేవాధికార సంస్థలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించే అవకాశాలు ఉన్నాయని, ఈ సేవలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారంలో గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంబంధిత వ్యవస్థల సహకారం తీసుకోవాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంధ్య, ఉపసర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు సుజాత, పోషం, శంకర్, రాజేశ్వరి, ఆశా కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!