తాండూర్ కస్తూరిబాలో న్యాయమూర్తి తనిఖీ,
పప్పుల నాణ్యతపై అసంతృప్తి.. ప్రొవిజన్ సరఫరా జాప్యంపై ఆరా.
తాండూర్: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 18.
బెల్లంపల్లి కోర్టు న్యాయమూర్తి శ్రాంతి సోని తాండూర్ కస్తూరిబా బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించడంతో పాటు వంటగదిని సందర్శించి భోజన ఏర్పాట్లు,
ప్రొవిజన్ సరఫరా వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారికి అందిస్తున్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు.వంటల్లో ఉపయోగిస్తున్న పప్పుల నాణ్యత సరిగా ఉండటం లేదని
విద్యార్థినులు న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ప్రొవిజన్ సరఫరాలో జాప్యం వల్ల పాఠశాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వివరించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం
అందించడంతో పాటు, సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఓ జే.కవిత,సీనియర్ న్యాయవాదులు జి.కె.ఎస్. ఠాకూర్,ఎల్.
రమ్య,ఏ. శివకుమార్,ఎం. శ్రీనివాస్,జూనియర్ న్యాయవాదులు గౌతమీ, ఎన్. సంగీత, ఉమారాణి, డీ ఎల్ ఎస్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

