ePaper
Saturday, November 28, 2026
ePaper
Homeజాతియంఢిల్లీస్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించాలి : డా. రాజి రెడ్డి

స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించాలి : డా. రాజి రెడ్డి

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ : అర్జున్ సమాచారం:
మిరప, ఇతర సుగంధ ద్రవ్యాల వంటి అధిక విలువ కలిగిన పంటల్లో రైతులు పురుగుమందులను విచక్షణారహితంగా వినియోగించడం ఆందోళనకరమని, పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణకే పరిమితం కాకుండా, వాటి అధిక వినియోగాన్ని నివారించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా. డి. రాజి రెడ్డి అన్నారు.
ఐసీఏఆర్ , న్యూఢిల్లీ ఆధ్వర్యంలోని అఖిల భారత పురుగుమందుల అవశేషాలు , కలుషిత పదార్థాల పర్యవేక్షణ నెట్‌వర్క్ ప్రాజెక్టు నిర్వహించిన 18వ జాతీయ స్థాయి పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ వార్షిక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ జి.ఎస్. రంధావా ఆడిటోరియంలో ఈ కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన డా. రాజిరెడ్డి, ఉద్యాన పంటలతో పాటు మొత్తం ఆహార సరఫరా వ్యవస్థలో పురుగుమందుల అవశేషాల సమాచారాన్ని సేకరించడం, వివిధ భాగస్వామ్య సంస్థలను సమన్వయం చేయడంలో చేస్తున్న కృషిని అభినందించారు.
డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఖచ్చితత్వ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలను వినియోగించడం ద్వారా అవసరానికి అనుగుణంగా పురుగుమందులను వాడాల‌న్నారు. పంటల్లో రసాయన అవశేషాలను తగ్గించి, ఆహార భద్రతను పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు పురుగుమందుల సముచిత వినియోగం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించాలని కూడా సూచించారు. ఈ సమావేశానికి బెంగళూరులోని సంచాలకులు డా. టి.కె. బెహరా అధ్యక్షత వహించారు. దేశంలోని వివిధ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!