ePaper
Saturday, November 28, 2026
ePaper
Homeజాతియంజనాభాతో సంబంధం లేకుండానే డీలిమిటేషన్.. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు? - అన్ని...

జనాభాతో సంబంధం లేకుండానే డీలిమిటేషన్.. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు? – అన్ని రాష్ట్రాల్లో 50 శాతం లోక్‌సభ స్థానాల పెంపునకు యోచన – జనాభా లెక్కల వివాదాలకు తావు లేకుండా పరిష్కారం చూపే యత్నం – రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి యథాతథంగా కొనసాగే అవకాశం – మహిళా రిజర్వేషన్లను వేగంగా అమలు చేసేందుకే మార్గం – కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత అధికారిక ప్రకటనకు అవకాశం

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసే దిశగా సాగుతోంది. జనాభా లెక్కల (సెన్సస్)తో సంబంధం లేకుండానే ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం మేర పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గ భేటీలో చర్చించి అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశముంది.
సాధారణంగా డీలిమిటేషన్ చేపట్టాలంటే తాజా జనాభా లెక్కలే ప్రామాణికం. కానీ కొత్త సెన్సస్ పూర్తయ్యే వరకు వేచిచూడకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జనాభా లెక్కలతో ఉన్న ముడిని పూర్తిగా తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో వాటిపై నేరుగా 50 శాతం అదనపు స్థానాలను కేటాయిస్తారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాల మధ్య ఎలాంటి రాజకీయ వివాదాలు రావు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని ఆందోళనలు ఉన్నాయి. ఇప్పుడు సెన్సస్‌తో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 50 శాతం పెంచితే ఆ భయాలు తొలగిపోతాయి. ప్రస్తుతం ఉన్న నిష్పత్తి యథాతథంగా కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాల ప్రాధాన్యత సమంగా ఉంటుంది. కేవలం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని త్వరితగతిన అమలు చేయడానికే కేంద్రం ఈ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ పూర్తయితేనే మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా దక్కుతుంది. గత ఏప్రిల్ నెలలో అవసరమైన సంఖ్యాబలం లేక ఈ బిల్లు ఆగిపోయింది. సెన్సస్ ముడిని తొలగిస్తే పునర్విభజన పనులు వేగంగా పూర్తవుతాయి. దీంతో మహిళా రిజర్వేషన్లు త్వరగా అమల్లోకి వస్తాయి.
నవంబరు 30 నుంచి డిసెంబరు 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ నవంబరు 30 నుంచి, రాజ్యసభ డిసెంబరు 2 నుంచి సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల విపక్షాల నుంచి 26 మంది ఎంపీలు ప్రభుత్వ శిబిరానికి మద్దతుగా నిలిచారు. తాజా బలంపై ఆధారపడి బిల్లును నెగ్గించుకోవాలని కేంద్రం చూస్తోంది.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!