ePaper
Saturday, November 28, 2026
ePaper
Homeతెలంగాణముత్తారంలో స్వీడన్ దేశo ప్రతినిధుల బృందం పర్యటన...

ముత్తారంలో స్వీడన్ దేశo ప్రతినిధుల బృందం పర్యటన…

📰 Generate e-Paper Clip

ముత్తారంలో స్వీడన్ దేశo ప్రతినిధుల బృందం పర్యటన…

అర్జున్ సమాచారం,నవంబర్ 27,ముత్తారం రిపోర్టర్…

రీజనరేటివ్ వ్యవసాయంపై ఐకియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధుల ఆసక్తి.రైతుల సాగు విధానాలు, సమస్యలపై ఆరా.. ప్రకృతి సేద్యంపై ప్రశంసలు,

ముత్తారం: నవక్రాంతి ఎఫ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ల్యాండ్‌మార్క్ రీజనరేటివ్ అగ్రికల్చర్ ప్రాజెక్టులో భాగంగా ముత్తారం మండల కేంద్రంలోని రైతు వ్యవసాయ క్షేత్రాన్ని స్వీడన్ దేశానికి చెందిన ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. ఐసీఎస్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ సతీష్ కుమార్ బోట్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో ఐకియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతు సాగు చేస్తున్న పత్తి పంటను ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ రకాల పంటల సాగు, అంతర పంటల విధానం, పంట మార్పిడి పద్ధతులు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

రైతుల సమస్యలపై ప్రత్యేక ఆరా.

రీజనరేటివ్ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ విధానాన్ని మరింత విస్తరించేందుకు అవసరమైన సదుపాయాలపై ప్రతినిధులు ఆరా తీశారు. సేంద్రీయ ఎరువుల లభ్యత, విత్తనాల ఖర్చు, మార్కెటింగ్ ఇబ్బందులు, వాతావరణ మార్పుల ప్రభావం, ప్రభుత్వ సహకారం తదితర అంశాలపై రైతులు తమ అనుభవాలను వివరించారు. ముఖ్యంగా వైటెక్స్ తయారీ విధానం, దాని ఉపయోగాల గురించి ప్రతినిధులు ప్రత్యేకంగా తెలుసుకున్నారు.

అనంతరం దర్యాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వీడన్ ప్రతినిధుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థిని కూచిపూడి నృత్యంతో అతిథులకు స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పశుపోషణ, వర్మీ కంపోస్ట్‌పై ఆసక్తి,

దర్యాపూర్‌కు చెందిన రైతు పెగడ రాజు అనుసరిస్తున్న పశుపోషణ విధానాలు, పశుసంపద అభివృద్ధి, వ్యవసాయంతో పశుపోషణ అనుసంధానం, వర్మీ కంపోస్ట్ పిట్ల తయారీ, వర్మీ వాష్ వినియోగం గురించి ప్రతినిధులు వివరంగా తెలుసుకున్నారు. రీజనరేటివ్ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడటం, పర్యావరణహిత సాగు పద్ధతులను ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతుతో చర్చించారు.

స్థానిక రైతులు అనుసరిస్తున్న ప్రకృతి అనుకూల వ్యవసాయ విధానాలను స్వీడన్ ప్రతినిధులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కేశనపల్లి గ్రామ సర్పంచ్ పెగడ తిరుమల కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. రాజశేఖర్, మేనేజర్లు బత్తిని శ్రీనివాస్, టి. సతీష్ కుమార్, పి. సింధు, నిఖిత, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు, ఫీల్డ్ ఆఫీసర్లు కె. మధుకర్, ఎస్. రాజశేఖర్, ఎన్. రాజశేఖర్, ఎస్. రాజు, జి. అజయ్, మోడల్ స్కూల్ విద్యార్థులు, వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!