ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్తుర్కపల్లిలో నకిలీ కరెన్సీ ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

తుర్కపల్లిలో నకిలీ కరెన్సీ ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

📰 Generate e-Paper Clip

యాదాద్రి భువనగిరి,జులై 16,అర్జున్ సమాచారం:

పదివేల నగదు రెండు మోటార్ సైకిళ్ళు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం పిల్లల ఆట కరెన్సీ నోట్లతో రూ.1 లక్షకు రూ.2 లక్షలు ఇస్తామని మోసం యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల చాకచక్యంతో కేసు ఛేదన సులభంగా డబ్బు వస్తుందంటే మోసపోవద్దు
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జూలై 15 సూర్య న్యూస్ పిల్లలు ఆడుకునే కరెన్సీ
నోట్లతో లక్షకు రెండు లక్షలు ఇస్తామని మోసం చేసిన ముగ్గురు నిందితులను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుండి పదివేల రూపాయల నగదు, రెండు మోటర్ సైకిళ్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షాన్స్
యాదవ్ ఆదేశాలు, పర్యవేక్షణలో తుర్కపల్లి పోలీసులు వేగంగా స్పందించి, పిల్లల ఆట కరెన్సీ నోట్లను ఉపయోగించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి నేరానికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తుర్కపల్లికి మండలానికి చెందిన ఒక వ్యక్తిని నిందితులు సంప్రదించి, రూ.1,00,000 ఇస్తే రూ.2,00,000 నగదు ఇస్తామని ఆశ చూపి నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పల్లెపహాడ్ స్టేజ్ సమీపంలో రూ.1,00,000 నగదును వారికి అప్పగించారు. అనంతరం నిందితులు ఇచ్చిన కరెన్సీ కట్టలను పరిశీలించగా, పైన, కింద మాత్రమే అసలైన రూ.500 నోట్లు ఉంచి, మధ్యలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషమెన్ అని ముద్రించిన పిల్లల ఆట కరెన్సీ నోట్లను ఉంచి మోసం చేసినట్లు గుర్తించాడని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలు, సమాచారాన్ని, సేకరించి బుధవారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో భువనగిరికి చెందిన ముదురుకోల యాకంబరం (29), ముదురుకోల దేవేందర్ (38) హయత్ నగర్ కుంట్లూరు కు చెందిన మద్దిబోయిన నాగరాజు (34)ను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పిల్లల ఆట కరెన్సీ నోట్ల 16 కట్టలు. రూ.10,000 నగదు. ఒక హీరో హోండా ప్యాషన్ మోటార్ సైకిల్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ప్రధాన నిందితుడు ముదురుకోల యాకంబరం గతంలో సుబేదారి, నర్సంపేటు పోలీస్ స్టేషన్లలో నమోదైన నకిలీ కరెన్సీ కేసుల్లో నిందితుడిగా ఉండి, ఆ కేసుల్లో ఆరెసై జ్యుడీషియల్ రిమాండ్కు వెళ్లినట్లు, ఇటీవల జైలు నుంచి విడుదలై మళ్లీ ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాన్స్ యాదవ్ ప్రజలకు సూచిస్తూ, సులభంగా అధిక డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైనా వేసే అఫర్లను, కరెన్సీ మార్పిడి పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇటువంటి మోసాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ లక్షాన్డ్ యాదవ్ పర్యవేక్షణలో, డీఎస్పీ పి. శ్రీనివాస్ నాయుడు. యాదగిరిగుట్ట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. శంకర్ మార్గదర్శకత్వంలో, తుర్కపల్లి ఎసీ మహమ్మద్ తఖియుద్దీన్, పోలీసు సిబ్బంది విజయవంతంగా ఛేదించారు.
==================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!